తాజా వార్తలు

హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
X

METRI

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గాన్ని.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఒకటిన్నర కిలోమీటర్ల మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడి నుంచి రాయదుర్గం వరకు మెట్రోరైల్‌లో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.

హైటెక్‌సిటీ- రాయదుర్గం రూట్లో మెట్రో ప్రారంభం కావటంతో.. ఐటి కారిడార్‌లో ఉద్యోగులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్లో సుమారు 40 వేల మంది ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు మెట్రో అధికారులు. మెట్రో రైల్‌ కొత్తమార్గం మధ్యాహ్నం రెండున్నర నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కారిడార్‌- 3 మార్గంలో ఇప్పటికే నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగుతుండగా.. శుక్రవారం మరో కిలోమీటరున్నర మార్గం అందుబాటులోకి వచ్చింది.

వచ్చే ఏడాది సంక్రాంతి వరకు.. MGBS నుంచి జూబ్లీ బస్టాండ్‌ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని రవాణ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు.

Next Story

RELATED STORIES