ప్రియాంకారెడ్డి హత్య అత్యంత బాధాకరం : జాతీయ మహిళా కమిషన్

ప్రియాంకారెడ్డి హత్య అత్యంత బాధాకరం : జాతీయ మహిళా కమిషన్

priyankareddy

డాక్టర్ ప్రియాంకారెడ్డి మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పలుపార్టీల నేతలతోపాటు, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాలు, మహిళా కమిషన్, ఆద్యాత్మిక వేత్తలు, యోగాగురూలు అందరూ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి ప్రగాడసానుభూతి తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు..

ప్రియాంకరెడ్డి హత్య అత్యంత హేయమైన ఘటన అని కేటీఆర్ అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. ఈ దారుణానికి ఒడిగట్టిన క్రూర జంతువులను పోలీసులు కఠినంగా శిక్షిస్తారని అన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

హైదరాబాద్ లో ప్రియాంక హత్య అత్యంత బాధాకరమని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారికత గురించి మాట్లాడుతున్న మనం రాత్రి 9గంటల సమయంలో కూడా భద్రత కల్పించలేకపోతున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story