తాజా వార్తలు

ప్రియాంక హత్య కేసు.. మూడంతస్తుల భవనం ఎక్కిన యువకుడు

ప్రియాంక హత్యతో కొంత మంది ఉద్వేగానికి లోనవుతున్నారు. ప్రధాన నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో ఓ యువకుడు మూడంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. నిందితులను వెంటనే ఉరి తీయాలని.. లేదంటే కిందకు దూకుతానంటూ రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హెచ్చరించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు అతని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES