దాదా మార్క్ సంస్కరణలు.. 2024 వరకు బీసీసీఐ అధ్య క్షుడిగా గంగూలీ?

దాదా మార్క్ సంస్కరణలు.. 2024 వరకు బీసీసీఐ అధ్య క్షుడిగా గంగూలీ?

ganguly.png

కెప్టెన్ గా టీమిండియా ఇమేజ్ పెంచిన దాదా.. క్రికెట్ బోర్డులోనూ సిక్సర్లు షురూ చేశాడు. బీసీసీఐ తొలి సమావేశంలోనే సంస్కరణకు తెరతీశాడు. లోధా సంస్కరణలను మార్చేందుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక సుప్రీం కోర్టు ఆమోదిస్తే బీసీసీఐ చీఫ్ గా గంగూలీ 2024 వరకు పదవిలో కొనసాగేందుకు లైన్ క్లియర్ కానుంది.

కెప్టెన్ గా టీమిండియా క్రేజ్ పెంచాడు. జట్టులో సంస్కరణలకు తెరతీశాడు. సీన్ కట్ చేస్తే అదే కెప్టెన్.. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. కానీ, దూకుడు మాత్రం తగ్గలేదు. కెప్టెన్ గా జట్టు విజయానికి చూపించిన దూకుడుని బీసీసీఐ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగిస్తున్నాడు గంగూలీ.

బీసీసీఐలో సంస్కరణలు అత్యవసరమని భావిస్తున్న గంగూలీ.. తన పదవి చేపట్టిన వెను వెంటనే సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. యుద్ధ ప్రాతిపదికన డే/నైట్ టెస్టును విజయవంతంగా నిర్వహించటంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు బోర్డును పక్షాళన చేసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు మాజీ కెప్టెన్. బీసీసీఐ చీఫ్ గా గంగూలీ హాజరైన తొలి సర్వసభ్య సమావేశంలోనే లోధ సంస్కరణల మార్పును సభ్యులు ఆమోదించారు. రెండు పదవుల మధ్య విరామం - కూలింగ్ ఆఫ్ పిరియడ్, క్రికెట్ సలహాదారుల కమిటీ, ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై బోర్డు సభ్యులు ఒకే చెప్పారు.

బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్లపాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్ మూడేళ్లపాటు తప్పనిసరిగా విరామం తీసుకోవాలని లోధా కమిటీ సిఫారసు. అయితే.. ఆ మూడేళ్ల విరామంలో ఆఫీస్ బేరర్లు ఏం చేయాలనే అసంతృప్తి రగులుతోంది. దీనికితోడు నాలుగేళ్లకు ఓ సారి నియమించే సెలక్షన్ ప్యానెల్ ఎంపిక కోసం ఇప్పటికీ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అవసరమా అనేది బీసీసీఐ యోచన. ఇలాంటి పస లేని సంస్కరణలను మార్చుతూ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా లోథా సంస్కరణల మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2024 వరకు గంగూలీ బీసీసీఐ చీఫ్ గా కొనసాగనున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ అంతకుముందు ఐదేళ్లు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. లోధా నిబంధనల ప్రకారం మరో 9 నెలల్లో బోర్డు పదవుల్లో గంగూలీకి ఆరేళ్లు పూర్తవుతాయి. అంటే ఆ తర్వాత బీసీసీఐ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

కోచ్, సెలక్టర్లను నియమించే క్రికెట్ సలహా కమిటీని కొనసాగించాల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. ఇక బోర్డు సెలక్షన్ కమిటీ విషయంలోనూ గంగూలీ తనదైన మార్క్ చూపించారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం త్వరలోనే పూర్తి అవుతోంది. అయితే.. మళ్లీ ఎమ్మెస్కేను చీఫ్ సెలక్టర్ గా కొనసాగించే అవకాశలు లేవని క్లారిటీ ఇచ్చారు గంగూలీ. ఇక మాజీ కెప్టెన్ ధోని విషయం తనకేమి తెలియదన్నాడు గంగూలీ. వచ్చే ట్వీ-ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొంటాడా? అసలు జట్టులో ధోని ఉంటాడా? అనేది ధోనినే అడిగి తెలుసుకోవాలన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story