అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి.. బ్లాక్‌ మెయిల్‌ చేసి..

అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి.. బ్లాక్‌ మెయిల్‌ చేసి..
X

rape

చనువుగా ఉంటూ ఓ వివాహితను లోబర్చుకున్నాడు. అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌ మెయిల్‌కి పాల్పడ్డాడు. ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ లోబర్చుకుని శారీరకంగా అనుభవించాడు. అంతేకాదు.. బాధిత మహిళ నుంచి 12లక్షల రూపాయలు అప్పు కూడా తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే మాత్రం మోహం తిప్పేశాడు. దీంతో ఆ బాధిత మహిళ.. కామాంధుడి ఇంటి ముందు న్యాయం పోరాడానికి దిగింది. తనకు న్యాయం చేయాలని.. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం అని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలికి మహిళా సంఘాలు కూడా మద్దతు న్యాయం చేయాలని కోరాయి. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది.

ఉపాధి కోసం భర్త దుబాయ్‌ వెళ్లడంతో రజిత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలను పోషిస్తు తిమ్మాపూర్‌లో జీవనం సాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి రజిత పట్ల చనువు పెంచుకుని ఆమెను లోబర్చుకున్నాడు. ఆమె నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. వాటిని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. బ్లాక్‌ మెయిల్‌ చేసి రజిత వద్ద నుంచి 12లక్షలు అప్పు కూడా తీసుకున్నాడు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ కొరడంతో మోహం చాటేశాడు కామాంధుడు. ఈ విషయం భర్తకు తెలియడంతో రజితను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు తనను మోసం చేసిన ప్రదీప్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని అతడి ఇంటి ముందే వంటా వార్పు చేపట్టింది. బాధితురాలికి మహిళా సంఘాలు కూడా బాసటగా నిలిచాయి. పరారీలో ఉన్న నిందితుడు ప్రదీప్‌ వెంటనే పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

తనను శారీకంగా వాడుకుని.. బ్లాక్‌ మెయిల్‌తో డబ్బులు తీసుకున్న ప్రదీప్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ డిమాండ్‌ చేస్తుంది.

Next Story

RELATED STORIES