సిగరెట్ మానేస్తే అదనంగా సెలవులు.. ఆఫీస్ ఆఫర్

సిగరెట్ మానేస్తే అదనంగా సెలవులు.. ఆఫీస్ ఆఫర్

smoking

సిగరెట్ తాగకండ్రా బాబు.. ఛస్తార్రా అని అన్నా ఎవరూ వినిపించుకోవట్లేదు.. గుప్పు గుప్పుమని గుండె పట్టుకుని అయినా సిగరెట్ పొగ వదులుతుంటారు పొగ రాయుళ్లు. మీ చావేదో మీరు చావండి.. ఎంత చెపినా వినిపించుకోనప్పుడు ఏం చేస్తాం అని ఊరుకుందామంటే సిగరెట్ పేరుతో ఆఫీస్ పని మధ్యలో విడిచి పెట్టి అరగంట బయటకు వెళతారు.. మళ్లీ వచ్చి టీలు, బాతాఖానీలు.. ఇంక మీరు పనిచేసేది ఎప్పుడు. అందుకే లాస్ట్ అస్త్రాన్ని ప్రయోగించింది సంస్థ యాజమాన్యం ఉద్యోగులపైకి.. మరి అది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలని అంటున్నారు.

టోక్యోలోని 'పియాలా ఐఎన్‌సీ' అనే మార్కెటింగ్ సంస్థ ఈ ఆఫర్‌ను ఉద్యోగుల ముందు ఉంచింది. ఆఫీస్ వచ్చి 29వ అంతస్థులో ఉంది. ఆ సరౌండిగ్స్ మధ్యలో ఎక్కడా సిగరెట్ తాగడానికి అనుమతి లేదు. మరి పొగ పీల్చందే పని చేయడం కష్టమని భావించేవారు చచ్చినట్టు కిందికి వెళ్లాల్సిందే. దాని కోసం ఓ 15.. 20 నిమిషాలు టైమ్ వేస్టు. సిగరెట్ తాగకుండా బుద్దిగా సీట్లో కూర్చుని పని చేసుకునే వారిపై పనిభారం పడుతోంది.

అదే విషయాన్ని మేనేజర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేశాడు ఓ ఉద్యోగి. కంపెనీ అధికారి ఓ బ్రహ్మాండమైన ఐడియా సిగరెట్ ప్రియుల ముందు ఉంచారు. ఆఫీస్ వేళల్లో స్మోకింగ్ పేరుతో బయటకు వెళ్లకుండా ఉంటే ఏడాదికి ఆరు సెలవులు అదనంగా ఇస్తామని ప్రకటించారు. ఈనెల నుంచి దీన్ని అమలు చేస్తున్నామంటూ ఆర్డర్స్ జారీ చేశారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థ అధికారి జారీ చేసిన ఆజ్ఞను కొందరు ఉద్యోగులు శిరసావహిస్తున్నారు.

Read MoreRead Less
Next Story