ప్రేమికుడు చేసిన పాపం.. తండ్రికి శాపం..

ప్రేమికుడు చేసిన పాపం.. తండ్రికి శాపం..
X

sucide

ప్రేమ విషయంలో తన కూతురికి జరిగిన అన్యాయంపై తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారులోని జండాల్‌ తండాలో చోటుచేసుకుంది. దారవత్‌ రామ అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్‌ చేయించి వదిలించుకునేందుకు కుట్ర పన్నాడు. దీంతో బాధితురాలి తండ్రి గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టించగా.. ఆ యువకుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. దీంతో గ్రామస్తులు బాధితురాలి తండ్రిని సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురి చేశారు. ఈ మాటలు తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story

RELATED STORIES