స్నానం చేస్తున్న యువతిని వీడియో తీస్తూ..

ఓవైపు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నా.. కొందరు కామాంధుల ఆగడాలు మితిమీరుతూనే ఉన్నాయి. స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో ఉండే 19 ఏళ్ల ఫరూక్‌ ఇంటి పక్కన కొందరు యువతులు నివసిస్తున్నారు. వారిలో ఓ యువతి బాత్‌రూమ్‌లో స్నానానికి వెళ్లగా కిటికీలోంచి వీడియో తీసేందుకు ప్రయత్నించాడు ఫరూక్‌. ఈ విషయాన్ని గమనించిన యువతి డయల్‌ 100కి కాల్ చేసింది. వెంటనే వచ్చిన పోలీసులు ఫరూక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES