పాత ఫోన్ మడతెట్టేయండి.. కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ.25వేలేనంట..

మార్కెట్లో ఎన్నో కొత్త రకం ఫోన్లు.. అందులో మడతపెట్టే ఫోన్లు వచ్చి మరింత ఊరిస్తున్నాయి. ఇప్పటికే లాంచ్ అయిన శాంసంగ్, త్వరలో లాంచ్ అవనున్న మోటో రేజర్ ధర లక్ష రూపాయల పైనే. కానీ ఎస్కోబార్ అనే సంస్థ కేవలం 349 డాలర్లకే (సుమారు రూ.25,000) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్‌ని, 128 జీబీ స్టోరేజ్‌ని కలిగి వుంది. దీని ధర వచ్చి రూ.25,000లు. మరొకటి 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. దీని ధర సుమారుగా రూ.35,800. అయితే ఈ ఫోన్లు గోల్డ్ కలర్‌లో మాత్రమే లభ్యమవుతాయి. మొదటి సేల్ టార్గెట్ లక్ష ఫోన్లు అని కంపెనీ వివరించింది.
మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 7.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ, అమోల్డ్ స్క్రీన్‌ను అందించారు. స్క్రీన్ పిక్సెల్స్ 1920x1444గా ఉండగా, ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు యాస్పెక్ట్ రేషియో 4:3గా ఉంది. రెండు కెమెరాలు ఉంటాయి. వీటి సామర్థ్యం 16 మెగా పిక్సెల్స్, 20 మెగా పిక్సెల్స్‌గా ఉంది. ఇంకా ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌ను అందించారు. ఆక్టాకోర్ 2.8 గిగాహెర్ట్ క్లాక్ స్పీడ్ ద్వారా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. యూఎస్ బీ టైప్ సీ, డ్యూయల్ సిమ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్టోరేజ్ పెంచుకోవడానికి అదనంగా మైక్రో ఎస్ డీ స్లాట్‌ను కూడా అందించారు. దీని ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. సాప్ట్‌వేర్ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT