దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం

hyd-metro

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు...రక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ మెట్రోలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో నిషేధం విధించారు. ఇప్పుడు పెప్పర్ స్ప్రేలను అనుమతించాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని మెట్రో రైలు ఎండీ NVS రెడ్డి తెలిపారు...

ఇటీవల మహిళలపై దాడులు పెరిగిపోతుండటం..దిశ ఘటనతో మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తంఅవుతోంది....దీంతో పెప్పర్ స్ప్రేల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై చర్చించిన మెట్రో ఉన్నతాధికారులు.. మహిళల భద్రత దృష్ట్యా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అటు బెంగళూరు మెట్రోలోనూ పెప్పర్ స్ప్రేను అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దిశ ఘటన తర్వాతే అక్కడి అధికారులు కూడా ఇందుకు అనుమతించారు.

Tags

Read MoreRead Less
Next Story