సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మారు తండ్రే పలు సార్లు..

సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మారు తండ్రే పలు సార్లు..
X

rapసూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన మారు తండ్రే పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంటిలో లేని సమయంలో.. పలుమార్లు బాలికపై లైంగిక దాడి చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే.. తల్లితో సహా అందర్నీ చంపేస్తానని బెదిరించి పైశాచిక ఆనందం పొందాడు మారు తండ్రి రాములు.

సూర్యాపేటకు చెందిన శారద అనే మహిళకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మొదటి భర్త పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో కూలీ చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది శారద. పిల్లల బాగోగులు చూసుకుంటాడనే ఆశతో కొన్నేళ్ల కిందట రాములు అనే లారీ డ్రైవర్‌ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రెండో భర్త రాములు వీరితోనే ఉంటున్నాడు. బాలిక చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటోంది. అప్పుడప్పుడూ తల్లితో కూలి పనికి వెళ్లేది. అయితే గత పదిహేను రోజులుగా తల్లి పనికి వెళ్లిన సమయంలో బాలికను లోబరుచుకునేందుకు మారు భర్త వేధించడం మొదలుపెట్టాడు.

తన మాట వినకపోయినా.. విషయం బయటకు చెప్పినా.. తల్లితో సహా అందర్నీ చంపేస్తానని చెప్పి 16 సంవత్సరాల మైనర్ కూతురుపై గత కొన్ని రోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. బుధవారం మరోసారి అత్యాచారం చేయబోయగా బాలిక తప్పించుకుని.. విషయం తల్లికి చెప్పింది. దీంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాపాడాల్సిన తండ్రే ఇలా పాపం చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలంటూ శారద రోదిస్తుంది. ఇలాంటి వారిని సమాజంలో తిరగనివ్వొద్దని.. వెంటనే ఊరి శిక్ష వేసి సమాజాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES