అంతర్జాతీయం

అమెరికాను ఉద్దేశించే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడా : డొనాల్డ్ ట్రంప్

అమెరికాను ఉద్దేశించే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడా : డొనాల్డ్ ట్రంప్
X

donald-trump

తనపై అభిశంసన విచారణ కొసాగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తాను అమెరికాను ఉద్దేశించే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే మీరు మాకు సాయం చేయాలని కోరానని, మాకు అంటే అమెరికా నుద్దేశించి మాట్లాడినట్లు ట్రంప్ వివరించారు. దీనిలో భాగంగానే అమెరికా అటార్నీ జనరల్ మీ వాళ్లకు ఫోన్ చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడితో అన్నానని, ఈ విషయాన్ని విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జోబిడెన్ పై విచారణ చేపట్టి తనకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కోరినట్లు ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Next Story

RELATED STORIES