వామ్మో.. తిమింగలం పొట్టలో ఇన్ని కిలోల ప్లాస్టిక్ ఉందా!

వామ్మో.. తిమింగలం పొట్టలో ఇన్ని కిలోల ప్లాస్టిక్ ఉందా!

plastic

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది. ఎటుచూసిన ప్టాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్‌ భూతం అన్ని రంగాలను ఆక్రమించేసింది. ఈ ప్లాస్టిక్ వాడకం ఎంతలా వ్యాపించిందంటే.. పచారీ కొట్టు నుంచి పసిపిల్లల పాలసీసా వరకు వినియోగం తప్పని సరిగా మారింది. ప్లాస్టిక్‌ వేలాది సంవత్సరాలు గడిచినా మట్టిలో కలిసిపోదు. దీని కారణంగా పర్యావరణానికి తీవ్ర ముంపు వాటిల్లుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.. ప్రకృతికి కలుగుతున్న నష్టాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ ప్రేమికులు ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నా ఫలితం లేదు. ప్లాస్టిక్‌ నిషేధంపై చట్టాలున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. స్కాట్లాండ్‌లోని హారిస్‌ బీచ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ.

ఇటీవల హారిస్‌ బీచ్‌ ఒడ్డుకు దాదాపు 20 టన్నుల భారీ మగ తిమింగలం కొట్టుకువచ్చింది. దీనిని గమనించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. బీచ్‌ వద్దకు చేరుకున్న అధికారులు.. తిమింగలాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దాని శరీరం నుంచి తాళ్లు, కప్పులు, బ్యాగులు, గ్లౌవ్స్‌, చేపలు పట్టే వలలు, బాల్స్‌ వంటి దాదాపు 100 కిలోల ప్లాస్టిక్‌ వస్తువులు బయటపడ్డాయి. దీంతో షాక్ తిన్న అధికారులు.. ఆ తిమింగలాన్ని అక్కడే పాతిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిమింగలం కడుపులో కిలోల కొద్దీ చెత్త పేరుకుపోవడం చూస్తుంటే మనుషులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story