తాజా వార్తలు

అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన వార్తగా మారిన ఎన్‌కౌంటర్

అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన వార్తగా మారిన ఎన్‌కౌంటర్
X

encounter

నిన్నటి వరకు జస్టిస్‌ ఫర్ దిశ నినాదాలు మార్మోగాయి. దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాయి. తెల్లారేసరికి నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పుడిది అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన వార్తగా మారింది. BBCవంటి వెబ్‌సైట్లలో బ్యానర్‌గా పెట్టారు. వేలాదిగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఆ వార్తలో రాశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అల్‌ జజీరాలోను ప్రధానంగా టేకప్‌ చేశారు. వాళ్ల వెబ్‌సైట్‌లో తొలిపేజీ మొత్తం ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌ ఫోటోను పెట్టేశారు. హత్యాచారం నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని వార్త రాశారు. తమ కస్టడీ నుంచి తప్పించుకుని పోతుంటే.. కాల్పులు జరిపామంటూ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ కథనం ఇచ్చారు.

ఖలేజా టైమ్స్ ఇండియా వర్షన్‌లోను దిశ నిందితు ఎన్‌కౌంటర్‌ వార్తే ప్రధానంగా కనిపించింది. బాధితురాలి ఇంటి దగ్గర మహిళలు స్వీట్లు పంచుతున్న ఫోటోను బ్యానర్‌లో పెట్టారు. కొందరు మహిళలు పోలీసులకు రాఖీ కట్టగా.. మరికొందరు స్వీట్లు తినిపించారు.

CNN మాత్రం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను లైట్ తీసుకుంది. ట్రంప్‌ అభిశంసనకు సంబంధించిన వార్త బ్యానర్‌లో కనిపించింది.

Next Story

RELATED STORIES