రాక్షసుల పాపం పండింది

రాక్షసుల పాపం పండింది
X

disha-accused

హైదరాబాద్‌ శివార్లలో నవంబర్‌ 27వ తేదీన దిశను హత్యాచారం చేశారు నలుగురు నిందితులు. ఆ స్కూటీకి పంచర్‌ ఏపిస్తామంటూ నమ్మించి.. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. ఆమె ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. కొన్ని గంటల్లో నిందితులను గుర్తించారు. 28వ తేదీన ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్.. నలుగురినీ పట్టుకున్నారు. ఆ తర్వాతి రోజు.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో వారిని విచారణ చేశారు. ఆ టైమ్‌లో పోలీస్‌స్టేషన్ బయట టెన్షన్‌ వాతావరణం కనిపించింది. దిశను పైశాచికంగా చంపేసిన కామాంధులను.. నడి రోడ్డుపై ఉరి తీయాలంటూ జనం డిమాండ్‌ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో షాద్‌నగర్‌ చేరుకున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చారు. అయితే.. పోలీసులు చట్టం ప్రకారమే నడుచుకున్నారు. ఆ తర్వాతి రోజు.. వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దీంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. అప్పటికే సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు.. హత్యాచారం ఘటనపై పకడ్బందీ ఆధారాల కోసం పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలో డిసెంబర్‌ నాలుగవ తేదీన కోర్టు నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించింది. మరోవైపు.. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది. అటు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సైతం ఏర్పాటు చేశారు. 5వ తేదీన.. భద్రత దృష్ట్యా చంచల్‌గూడ జైలుకు వెళ్లి.. ఆ నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేసింది. ఈ క్రమంలోనే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు వారిని చటాన్‌పల్లిలో స్పాట్‌కు తీసుకెళ్లారు. అయితే.. ఆ నలుగురు కామాంధులు తోక జాడించే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు తుపాకులకు పని చెప్పారు. ఎక్కడైతే.. దిశను కాల్చేశారో.. అక్కడికి జస్ట్‌ అర కిలోమీటర్ దూరంలో ఎన్‌కౌంటర్‌ అయిపోయారు.

Next Story

RELATED STORIES