చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనలో కీలక మలుపు

చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనలో కీలక మలుపు

encounter

దేశ్యాప్తంగా సంచలనం రేపిన చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ను సుమోటోగా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ కేసుపై అత్యవసర దర్యాప్తునకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణకు బృందాన్ని పంపాలని ఆదేశించింది. దీంతో శనివారం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలంచనుంది NHRC బృందం.

NHRC ఎంట్రీతో తెలంగాణ పోలీసులకు కొత్త చిక్కులు ఎదురవబోతున్నాయా? NHRC టీం ఏయే ఆంశాలపై ఫోకస్ చేయబోతోంది? విచారణను ఎదుర్కునేందుకు పోలీసులు ఎలా సిద్ధమవుతున్నారు? ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నా..నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణ టెన్షన్ పుట్టిస్తోంది. ఎన్ కౌంటర్ బూటకమా? నిజంగా ప్రణాపాయ పరిస్థితుల్లో తేల్చుకునేందుకు శనివారం నిజనిజర్ధాణ కమిటీ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులు, కాల్పుల జరిగిన తీరుపై సైబరాబాద్ పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తుంది. బుల్లెట్లు ఎక్కడెక్కడ తగిలాయి..పారిపోతుండగా కాల్చారా..? తిరగబడుతున్న సమయంలో కాల్చారా అనేది ఆరా తీయనున్నారు. అనతంరం మృతదేహాలను పరిశీలించి ఎంత దూరం ఉన్న సమయంలో కాల్పులు జరిగాయనే కోణంలోనూ NHRC బృందం విచారణ జరపనుంది.

రాష్ట్రంలో ఎన్ కౌంటర్ ఘటన హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ మహిళా సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎలా ఎన్ కౌంటర్ చేస్తారని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ కౌంటర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళ సంఘం నేతలు. ఇదే లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఆదేశాలతో చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటన కొత్త మలుపు తిరిగింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి ఈ సాయంత్రం అందిన పిటీషన్ పై అత్యవరసర విచారణ చేపట్టిన హైకోర్టు..నిందితుల అంత్యక్రియలపై కీలక ఆదేశాలిచ్చింది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ మృతదేహాలను ఈ నెల 9న రాత్రి 8 గంటల వరకు భద్రపరచాల్సిందిగా సూచించింది.

హైకోర్టు విచారణకు ప్రభుత్వం తరపున హజరైన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్..పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీసినట్లు కోర్టు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం పోస్ట్ మార్టం వీడియోను మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తైంది. హైకోర్టు ఆదేశాల డెడ్ బాడీలను భద్రపరిచేందుకు గాందీ ఆస్పత్రికి తలించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story