పట్టపగలే ఐసీఐసీఐ బ్యాంక్‌లో చోరీ

X
TV5 Telugu7 Dec 2019 6:48 AM GMT
ఉత్తరప్రదేశ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బస్తీ పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బ్యాంక్‌లోకి చొరబడ్డ దోపిడీ దొంగలు.. అక్కడి సిబ్బందిని.. కస్టమర్స్‌ను బెదిరించి మరీ చోరీ చేశారు. బ్యాంక్ నుంచి ఏకంగా రూ.30 లక్షలు దోచుకెళ్లారు. దొంగలు తుపాకీలు ఎక్కుపెట్టడడంతో.. బ్యాంక్‌లో ఉన్నవాళ్లంతా భయభ్రాంతులకు గురి అయ్యారు. చోరీ విజువల్స్ బ్యాంక్ సిసి పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. బ్యాంక్ సెక్యురిటీ సిబ్బంది కూడా దోపిడీని అడ్డుకోలేకపోయారు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యాక సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిసీ పుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
Next Story