వివాహ వేడుకలో డ్యాన్స్ ఆపినందుకు గన్‌తో కాల్చిన గ్రామ పెద్ద బంధువు

వివాహ వేడుకలో డ్యాన్స్ ఆపినందుకు గన్‌తో కాల్చిన గ్రామ పెద్ద బంధువు
X

up-dancer

ఓ దుండగుడి క్షణికావేశం మరో డ్యాన్సర్‌‌ ప్రాణాల మీదకు తెచ్చింది. మధ్యలో డ్యాన్స్‌ ఆపేసింది అనే చిన్న కారణంతో రెచ్చిపోయాడు కిరాతకుడు.. ఆవేశంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న తుపాకీతో డ్యాన్స్‌ర్‌ తలకు గురి పెట్టి కాల్చేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే స్టేజ్‌పై ఉన్న డాన్సర్‌ ముఖానికి బులెట్‌ తగిలి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో చోటుచేసుకుంది.

వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఆపినందుకు ఓ యువతిని తుపాకితో కాల్చిపడేశాడో గ్రామ పెద్ద బంధువు. ఈ నెల ఒకటవ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిక్రీ గ్రామంలోని ఓ గ్రామ పెద్ద కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా జరిపేందుకు.. డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశారు. ఆ షోలో ఒక డ్యాన్సర్‌ డ్యాన్స్ చేస్తుండగా అస్వస్థతకు గురై మధ్యలోనే ఆపేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ పెద్ద బంధువు ఆమెపై తుపాకితో కాల్పులు జరిపాడు. అందరూ చూస్తుండగానే ఆమె స్టేజిపైనే కుప్పకూలింది. రక్త మోడుతున్న ఆమెను వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

డ్యాన్సర్‌ను తుపాకితో కాలుస్తున్న వీడియో శుక్రవారం బటయకు వచ్చింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో యువతి డ్యాన్స్ ఆపగానే ఓ వ్యక్తి లేచి నిల్చుని తుపాకితో కాల్చనా? అని ఆవేశంతో అరవడం.. ఆ వెంటనే మరో వ్యక్తి సుధీర్ భయ్యా.. షూట్ చేయండి అనడం వీడియోలో వినబడుతోంది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES