అంతర్జాతీయం

ఇరాక్‌లో కాల్పుల కలకలం.. 25మంది మృతి

ఇరాక్‌లో కాల్పుల కలకలం.. 25మంది మృతి
X

iraq

ఇరాక్ లోని బాగ్దాద్ లో ఓ దుండుగుడు విచక్షణా రహిత కాల్పులకు తెగబడటంతో 25మంది మరణించారు. మరో 130 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వందలాదిమంది ఆందోళచేపట్టారు. నిరసనకారులను టార్గెట్ చేసిన ఆగంతకుడు వారిపై కాల్పులకు తెగబడ్డాడు. నిరసనల్లో పాల్గొన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దీంతో అక్కడ భయానకవాతావరణం చోటుచేసుకుంది. దేశంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దేశ అంతరంగిక వ్యవహారాల్లో ఇరాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Next Story

RELATED STORIES