తాజా వార్తలు

దిశ దారుణ హత్యకు గురయినప్పుడు ఈ సంఘాలు ఎక్కడ? : కాలనీ వాసులు

దిశ దారుణ హత్యకు గురయినప్పుడు ఈ సంఘాలు ఎక్కడ? : కాలనీ వాసులు
X

nhrc-1

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC.. అన్ని కోణాల్లోనూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న కమిషన్‌ ప్రతినిధులు మహబూబ్‌నగర్‌ నుంచి విచారణ ప్రారంభించారు. ఆదివారం శివరాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పోలీస్‌ అకాడమీలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహ్మద్ అరిఫ్, జొల్లి శివ, నవీన్, చెన్నకేశవుల కుటుంబాలతో సమావేశమైన అధికారులు.. వారు చెప్పిన అంశాలను నమోదు చేసుకున్నారు. అటు దిశ తండ్రి, చెల్లెలిని కూడా ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపైనా విచారించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు..

ఎన్‌కౌంటర్‌లో సమయంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ను కూడా కూడా NHRC బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు.. అంతరం జరిగిన పరిణామాలపై వారి నుంచి వివరాలను సేకరించారు. ఎలా గాయపడ్డారు.. ఆ సమయంలో ఏం జరిగింది అన్న అంశాలపై ఆరా తీశారు.

మానవ హక్కుల సంఘాల తీరుపై దిశ కాలనీ వాసులు భగ్గుమన్నారు. మానవ మృగాల చేతితో దిశ దారుణ హత్యకు గురయినప్పుడు ఈ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి బాసటగా నిలవాల్సిన NHRC దోషులకు వంత పాడుతున్నట్లు ఉందని ఆరోపించారు. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.. దిశ హత్య జరిగి నేటికి 11 రోజులు అయింది. శంషాబాద్‌లోని నక్షత్ర విల్లా కాలనీలో దిశ దశదిన కర్మ నిర్వహించారు. దిశకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్ కు సీపీ మహేష్ భగవత్ నేతృత్వం వహించనున్నారు. ఎస్పీ కె.అపూర్వరావు, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి , డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి , ఐటి సెల్ శ్రీధర్ రెడ్డి , సీఐ రాజశేఖర్ రాజు, ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

మరోవైపు హైకోర్టులో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఈ రోజు విచారణ జరగనుంది. నిందితుల మృతదేహాలను సోమవారం వరకు భద్రపరచాలని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించింది. 3 రోజులుగా డెడ్‌బాడీస్‌ మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలోనే భద్రపరిచారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.. హైకోర్టు ఆదేశాల తర్వాత అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story

RELATED STORIES