దర్జాగా వచ్చి.. దొంగలా చిక్కాడు

దర్జాగా వచ్చి.. దొంగలా చిక్కాడు
X

thieft

జైల్లో ఉన్న తన స్నేహితులను చూసేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. మహారాష్ట్రకు చెందిన పార్ధి గ్యాంగ్‌ గత కొంతకాలంగా రైల్వే సిగ్నల్‌ లైన్‌ కట్‌ చేసి చోరీలకు పాల్పడుతోంది. రైలు ఆగిన వెంటనే ఒకరిపై ఒకరు నిచ్చెనలా మారి బోగి కిటికీల దగ్గర ఉన్న వాళ్లను రాళ్లతో బెదిరించి దోచేయడాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఇదే తరహాలో అనేక చోట్ల భారీ చోరీలకు పాల్పడ్డారు.

గత కొంతకాలంగా రైల్వే పోలీసులకు, ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నఈ గ్యాంగ్‌కు చెందిన 8 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు అవినాష్‌ పరారయ్యాడు. అయితే వారి మిత్రులను కలిసేందుకు వచ్చింది పరారీలో ఉన్న నిందితుడి అవినాష్ అని గుర్తించిన పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి.. అరెస్ట్‌ చేశారు.

Next Story

RELATED STORIES