హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త

hyderabad-metro

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. షుగర్ బాక్స్ వైఫై సాయంతో జీ5, ఫ్రీ ప్లే మొబైల్ అప్లికేషన్స్‌లో ఇంటర్నెట్ లేకుండా సినిమాలు, వీడియోలు చూసే కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. మెట్రో రైల్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సినిమాలు, ఇతర వీడియోలు చూడొచ్చని, డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మొదట 10 మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకోస్తున్నామన్నారు. త్వరలోనే మిగతా స్టేషన్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ యాప్‌ ద్వారా కేవలం మూడు నిమిషాల్లో సినిమా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్దమయిందని.. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. జనవరి నెల చివారినాటికి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సర్వీసును అందుబాటులోకి తెస్తామన్నారు. మరోవైపు మొదట 60 రోజుల వరకు ఉచితంగా షుగర్ బాక్స్ సేవలు అందిస్తామని.. తర్వాత ప్రీమియం ఛార్జీ వసూల్ చేస్తామని షుగర్ బాక్స్ సీఈవో రోహిత్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story