Top

క్రిస్‌మస్ గిప్ట్ చూసి ఉద్యోగులు షాక్..

క్రిస్‌మస్ గిప్ట్ చూసి ఉద్యోగులు షాక్..
X

bonus

పండక్కో, ప్రత్యేక సందర్భానికో బోనస్.. కొన్ని ఆఫీసుల్లో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వడమో లేదంటే ఉద్యోగులు ఊహించని గిప్ట్ ఏదైనా ఇవ్వడమో చేస్తుంటాయి సంస్థ యాజమాన్యాలు. రానున్న క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బాస్ ఇచ్చిన కవర్ చూసి కన్నీళ్లు పెడుతున్నారు సంస్థ ఉద్యోగులు. ఓపెన్ చేసి చూసి నోరెళ్లబెడుతున్నారు. మీరు మాకు బాస్ కాదు.. నిజంగా మా పాలిట దేవుడు అని వేనోళ్ల పొగుడుతున్నారు. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆత్మీయంగా కౌగలించుకుంటున్నారు.

మేరీల్యాండ్‌కు చెందిన సెయింట్ జాన్ ప్రాపర్టీస్ సంస్థ చైర్మన్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలనుకున్నారు. ఇందుకోసం సంస్థలో పనిచేసే 200 మంది ఉద్యోగులకు డిన్నర్ ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరికీ ఓ కవర్ చేతిలో పెట్టి.. ఇది మీకు కంపెనీ ఇస్తున్న క్రిస్మస్ గిప్ట్ ఇది అని చెప్పారు. దాంతో ఆత్రంగా కవర్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరి కవర్లో 10 మిలియన్ డాలర్లు (రూ.35 లక్షలు) ఉన్నాయి. బాస్‌కి తమపై ఉన్న ప్రేమకు, నమ్మకానికి ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి గురయ్యారు.

ఉద్యోగులను ఉద్దేశించి బాస్ మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే సంస్థ లాభాల్లో నడుస్తుందని, ఈ సంవత్సరం అనుకున్న లక్ష్యాలను అధిగమించిందని ఎడ్వర్డ్ అన్నారు. ఈ ఆనందంలో ఉద్యోగులను కూడా భాగస్వామ్యులను చేయాలని ఈ గిప్ట్ ఇచ్చినట్లు ప్రకటించారు. బోనస్ అందుకున్న ఉద్యోగులు బాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

RELATED STORIES