దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు

disha

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌.. ఢిల్లీ నుంచి కేసు దర్యాప్తు చేసేలా చూస్తామన్నారు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే. దీనిపై మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీరెడ్డిని ఇప్పటికే సంప్రదించంగా.. ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో రిటైర్డ్‌ జడ్జ్‌ల పేర్లు సూచించాలని పేర్కొన్న ధర్మాసనం.. గురువారం కూడా విచారణ కొనసాగించనుంది.

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌, ముఖేశ్‌ కుమార్‌ శర్మ దాఖలు చేసి పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డే, జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. అయితే తమ వాదనలు విన్న తర్వాతే.. కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే.. ఎన్‌కౌంటర్‌ ఘటనపై పూర్తి అవగాహానతోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌తో దర్యాప్తు చేయించాలని భావిస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story