దారితప్పిన టీచర్.. విద్యార్థినులతో అసభ్యంగా..

X
TV5 Telugu13 Dec 2019 11:57 AM GMT
అతనో ఉపాధ్యాయుడు.. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ.. ఆ టీచర్ దారితప్పాడు. ఏకంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో బాలికల పేరెంట్స్.. పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది.
నేరేడ్‌మెట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పోలీసులు విచారణ జరిపి.. ఉపాధ్యాయుడు జగదీశ్వర్‌పై పోక్సో చట్టం సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
దిశలాంటి ఘటనల్లో.. నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినా.. ఇంకా కామాంధుల్లో మార్పు రాకపోవడం లేదు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులను.. కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Next Story