నా ఐఫోన్.. నన్ను కాపాడింది..

నా ఐఫోన్.. నన్ను కాపాడింది..

Gale

ఐఫోన్ ధర ఎక్కువే.. దాని వల్ల కలిగే లాభాలు కూడా ఎక్కువే మరి. అమెరికాలోని అయోవా రాష్ట్రం మేసన్ సిటీలో నివసిస్తున్నగేల్ సాల్పెడో అనే వ్యక్తి రెండు రోజుల క్రితం కారులో కాలేజీకి వెళ్తున్నాడు. దారి మొత్తం దట్టమైన మంచుతో కప్పబడి ఉంది. దీంతో గేల్ కారు ముందుకు వెళ్లలేకపోయింది. కారు రూట్ మారి పక్కనే ఉన్న విన్నెబాగో నదిలో పడిపోయింది. వెంటనే గేల్ తన ఫోన్ కోసం వెతికాడు. అద్దాలు దించి సహాయం కోసం అరిచాడు.. ఎవరికీ వినిపించలేదు.. ఫోనూ కనిపించలేదు. కారు నిండా నీళ్లు చేరడంతో తాను బతకడం కష్టమనుకుని ఆశలు వదిలేసుకున్నాడు. కానీ చివరి ప్రయత్నంగా.. 'సిరి.. కాల్ 911' అని గట్టిగా అరిచాడు.

అమెరికాలో 911 అనేది ఎమర్జెన్సీ నెంబర్. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఐఫోన్‌లో ఫీడ్ చేసి ఉంచిన నెంబర్ సిరి అనేది ఇంటిలిజెంట్ అసిస్టెంట్. దీని ద్వారా వాయిస్ కమాండ్‌తోనే నచ్చిన వారికి ఫోన్ చేయడంతో పాటు అనేక పనులు చేయవచ్చు. అందుకే గేల్ చివరి ప్రయత్నంగా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అరిచిన శబ్ధానికి తన కారులో పడిపోయిన ఐఫోన్ నుంచి 911కి కాల్ వెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే ఆ వంతెన దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నదిలో గేల్ కారు కనిపించడంతో రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద గేల్‌ను ప్రాణాలతో కాపాడారు. ప్రాణాల మీద ఆశ వదులుకున్న టైమ్‌లో ఐఫోన్ తనకు లైఫ్ ఇచ్చిందని గేల్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Read MoreRead Less
Next Story