ప్రేయసిని గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు

ప్రేయసిని గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు
X

lover-cheating-girl

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. గర్భవతిని చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళిగూడెంలో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని శ్యాంసుందర్‌ గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అనంతరం మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని బాధితురాలు ఆరోపించింది. అనంతరం అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. పెళ్లి మాట ఎత్తితే తప్పించుకు తిరుగుతున్నాడని వాపోయింది. గ్రామ పెద్దల్ని ఆశ్రయించినా ఎవరూ న్యాయం చేయలేదని తెలిపింది. పోలీసులైనా న్యాయం చేయాలని వేడుకుంది.

Next Story

RELATED STORIES