ప్రియుడి మోజులో భర్తనే కడతేర్చిన భార్య

ప్రియుడి మోజులో భర్తనే కడతేర్చిన భార్య
X

killed

వివాహేతర సంబంధం ఆ ఇంట్లో చిచ్చుపెట్టింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. పక్కా ప్లాన్‌ ప్రకారం సుపారీ ఇచ్చి కిరాయి రౌడీలతో దారుణంగా హత్య చేయించింది. మృతదేహం ఆనవాళ్లు కూడా దొరక్కుండా చేయాలని కుట్ర పన్ని భార్య.. కర్నాటక రాష్ట్రానికి తీసుకెళ్లి మరీ హత్య చేయించింది. డెడ్‌బాడీని అక్కడే తగులబెట్టించింది. కానీ చివరికి ఆ దుర్మార్గపు భార్య పాపం పడింది. అసలు విషయం బయటపడింది. చివరికి కటకటాల పాలైంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా బొమ్మనపాడు గ్రామానికి చెందిన భార్యభర్తలు నాగరాజు, హేమలత గత 9 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కి వలస వచ్చారు. బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్ లో అద్దెకు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో నాగరాజు.. వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డికి.. నాగరాజు భార్య హేమలతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇద్దరి చేష్టలతో విసిగిన నాగరాజు ఏడాది క్రితం ఎలీఫ్‌లోని పారిశ్రామికవాడలోకి మకాం మార్చాడు. అందులోని ఓ పరిశ్రమలో భార్యభర్తలిద్దరూ పని చేస్తున్నారు. అయినప్పటికీ వెంకటేశ్వర్‌రెడ్డితో హేమలత సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో గొడవలు జరుగుతుండేది. పద్దతి మార్చుకోవాలని ఎన్నోసార్లు భార్యను మందలించాడు భర్త. ఐనా హేమలత తన పద్దతిని మార్చుకోలేదు. పైగా తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త నాగరాజును హతమార్చాలని హేమలత, వెంకటేశ్వర రెడ్డిలు ప్లాన్ వేశారు. గతంలో రెండుసార్లు భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసినా అది వర్కౌట్‌ కాలేదు. చివరికి సుపారీ ఇచ్చి దుండగులతో హత్య చేయించింది.

మంగళవారం సాయంత్రం వెంకటేశ్వర రెడ్డి కారులో నాగరాజుని కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు తీసుకెళ్లాడు. అక్కడ నాగరాజుకు ఫుల్‌గా మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం కిరాయిగుండా మాపన్నతో కలిసి .. నాగరాజును బండరాయితో మోది హత్య చేశారు. తర్వాత రోడ్డుపక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి నాగరాజుపై టర్పెంటాయిల్ పోసి సజీవదహనం చేశారు. భర్త హత్య అనంతరం.. భార్య ఏమీ తెలియనట్టుగా వ్యవహరించి బంధువులతో కలిసి అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న మృతుని తల్లి.. బాచుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. వెంకటేశ్వరరెడ్డితో కలిసి భార్య హత్య చేయించినట్టు తేలింది. నిందితులు వెంకటేశ్వరెడ్డి, మాపన్నలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story

RELATED STORIES