బోయిన్‌పల్లిలో హత్య కేసును చేధించిన పోలీసులు

బోయిన్ పల్లిలో హత్య కేసును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తూముకుంట మాధవ రెడ్డి, సమల మాధవ రెడ్డి, జక్కుల సురేందర్ రెడ్డి, కారు డ్రైవర్ నరేష్ సింగ్‌ను అరెస్ట్ శారు. ఈ నెల 7వ తేదీన శరనప్ప అనే వాచ్‌మెన్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టారు నలుగురు దుండగులు.. తీవ్రంగా గాయపడ్డ శరనప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రకాష్ రెడ్డి అనే ఫ్లాట్ యజమాని దగ్గర శరణప్ప వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఫ్లాట్ విషయంలో మాధవ్ రెడ్డితో ప్రకాష్ రెడ్డికి గొడవలు ఉన్నాయి. ఈ గొడవలో భాగంగా ప్రకాష్ రెడ్డిపై దాడి చేసేందుకు మాధవర్ రెడ్డి అనుచరులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని గేటు దగ్గరే వాచ్‌మెన్ శరనప్ప అడ్డుకోవడంతో.. అతడిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పటించారు, 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొదుతూ వాచ్‌మెన్ మృతి చెందాడు.
ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు మాధవ రెడ్డిపై గతంలో ఐదు కేసులు ఉన్నాయన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com