అభిశంసన ప్రక్రియపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్ ప్రక్రియ వచ్చే వారం జరగనుంది. ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవేనని ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ అభిప్రాయప డింది. ఈ మేరకు తీర్మానాన్ని 23-17 ఓట్ల తేడాతో ఆమోదించింది.
ఇక, అభిశంసనపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం ఎంతో చేస్తున్న తనపై అభిశంసన తీసుకురావడం సరైంది కాదని ట్రంప్ పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపితంగానే తనపై అభిశంసన తీసుకొచ్చార ని మండిపడ్డారు. డెమోక్రటిక్ పార్టీ నాయకులు విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అభిశంసన తీర్మానాన్ని ఉపయోగించాలని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com