సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీష్ శ్రీకారం

సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీష్ శ్రీకారం

haris

సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గృహప్రవేశాల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అర్హులైన నిరుపేదలకు రూపాయిఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు. సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి రాఘవాపూర్‌లో రెండు పడకల గదుల ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో హరీష్‌రావుకు ఘనస్వాగతం పలికారు.

పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామన్న మంత్రి.. ప్రతీ ఇంటి ముందు మొక్కలు నాటి రక్షించాలని గ్రామస్తులను కోరారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడొద్దని, రోడ్ల నిర్మాణ పనులు దశల వారీగా చేపడుతామని హామీ ఇచ్చారు. యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తామని చెప్పారు

రాఘవాపూర్‌లో పర్యటన అనంతరం సిద్ధిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డి పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్‌తో కలిసి బుల్లెట్ వాహనంపై గ్రామంలో పర్యటించారు. శివాజీ, అంబేద్కర్‌,తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి సహకరించిన దాతలను హరీష్‌రావు సన్మానించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story