తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు షాక్ ఇచ్చిన విద్యుత్‌ శాఖ

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు షాక్ ఇచ్చిన విద్యుత్‌ శాఖ
X

krm

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు షాక్‌ ఇచ్చారు విద్యుత్‌ అధికారులు. ఒక్కో ఇంటికి సుమారు 5 వేల నుంచి 90 వేల రూపాయల వరకు బిల్లులు పంపించారు. దీంతో ఆ బిల్లులు చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. సుమారు 200 నుంచి 300 ఎస్సీ కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తున్నాయి. పదేళ్ల కిందట వారి ఇంటికి విద్యుత్‌ మీటర్లు అమర్చారు సిబ్బంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రీడింగ్‌ తీసుకోవడం తప్ప.. ఎప్పుడు బిల్లులు పంపించలేదని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వేలల్లో బిల్లులు పంపిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదనే కారణంతో విద్యుత్‌ కూడా నిలిపేయడంతో వారంతా ఆందోళన బాట పట్టారు. వారి మద్దతుగా అఖిలపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. వెంటనే విద్యుత్‌ను పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES