చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన మృగాడు

చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన మృగాడు
X

hyd

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేశాడు. మూసా అనే యువకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఈనెల 8వ తేదీన జరిగింది. ఛార్మినార్‌ వెళ్లేందుకు హస్మాబాద్‌ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తోన్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల దగ్గరకు ఆటోతో వచ్చాడు మహ్మద్‌ అమీర్‌. తమను ఛార్మినార్‌ వద్ద జఘీంర్‌ పిల్లా దర్గాకు తీసుకెళ్ళాలని అక్కా చెల్లెళ్లు అమీర్‌కు చెప్పారు. అయితే.. ఇంత రాత్రి వేల దర్గాకు వెళ్లటం మంచిది కాదని వారికి నచ్చ జెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. రేపు సాయంత్రం దర్గాకి తీసుకెళతానని అమీర్‌.. అక్క చెల్లెళ్లకు చెప్పాడు.

అయితే.. అమీర్‌ను తన కుటుంబ సభ్యులు నిలదీయటంతో అక్క చెల్లెళ్లను దర్గా వద్ద దింపమని తన తమ్ముడు మూసాకు చెప్పాడు. తన బైక్‌పై ఇద్దరు అక్కచెల్లెళ్లను ఎక్కించుకుని నాంపల్లి వరకు తీసుకెళ్లిన మూసా. అక్కడ ఓ హోటల్‌లోని ఓయూ రూమ్‌కు తీసుకెళ్లాడు. చెల్లెలిని చంపుతానని బెదిరించి అక్కపై పలు మార్లు అత్యాచారం చేశాడు. అనంతరం.. మూసా.. ఇద్దరు అక్క చెల్లెళ్లను ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌వద్ద విడిచి పెట్టి తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఈనేపథ్యంలో .. ఇద్దరు అక్కచెల్లెళ్లు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కచెల్లెళ్లిద్దరూ ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో ఉండడాన్నిగుర్తించిన రైల్వే పోలీసులు చాంద్రాయణ గుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో నిందితుడు మూసా .. అక్కపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు తేలింది. నాంపల్లి హోటల్‌లో ఓయు రూమ్‌ తీసుకునేందుకు మూసా ఫేక్‌ ఐడి కార్డులు వాడినట్టు పోలీసులు గుర్తించారు.

Next Story

RELATED STORIES