'దొంగ' ముందు కళ తప్పుతోన్న 'ప్రతిరోజు పండగే'

దొంగ ముందు కళ తప్పుతోన్న ప్రతిరోజు పండగే
X

poster

కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరి ఖలేజా ఏంటనేది తేలిపోతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఈ పోటీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూంటుంది. అలాంటి ఓ కాంపిటీషనే టాలీవుడ్ లో నెక్ట్స్ వీక్ జరగబోతోంది. మూడు సినిమాలు విడుదలవుతున్నా.. ఎక్కువ క్రేజ్ ఉంటుందనుకున్న ఓ సినిమా డబ్బింగ్ మూవీ కంటే బాగా వెనకబడిపోయింది. మరి ఆ మూవీ ఏంటో తెలుసా..? ప్రతి రోజు పండగే. సాయితేజ్, రాశిఖన్నా జంటగా మారుతి డైరెక్షన్ లో వస్తోన్న సినిమా ప్రతి రోజు పండగే. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలా సినిమాలు గుర్తొచ్చాయి అనే టాక్ వచ్చింది. ఆ విషయం పై కూడా వాళ్లే ట్రైలర్ లో సెటైర్ వేశారు. సాయితేజ్ కు వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఆ రిలీఫ్ ను ఈ ప్రతిరోజు పండగే ఇంకా పెంచాలి. కానీ పరిస్థితి చూస్తోంటే అలా కనిపించడం లేదంటున్నారు. అందుకు కారణం 'దొంగ'.

donga

రీసెంట్ గా ఖైదీ సినిమాతో ట్రెమండస్ హిట్ అందుకున్న కార్తీ కూడా ఈ నెల 20న దొంగ సినిమాతో వస్తున్నాడు. నిజ జీవితంలో కార్తికి ఒదిన అయ్యే జ్యోతిక ఈ సినిమాలో అతనికి అక్కగా నటించడం విశేషం. అయితే ఖైదీ వల్ల వచ్చిన క్రేజ్ ఈ మూవీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే దొంగ ట్రైలర్ కూడా చాలా బావుందనే టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు డబ్బింగ్ సినిమానే అయినా ప్రతి రోజు పండగేతో పోల్చుకుంటే ప్రేక్షకులు ఈ దొంగ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారనే టాక్ ఉంది.

ఖచ్చితంగా చెబితే వచ్చే వారం ప్రతిరోజు పండగే వర్సెస్ దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితిని క్లియర్ గా గమనిస్తే.. వీటిలో దొంగకే కాస్త ఎక్కువ క్రేజ్ ఉందని ఎవరైనా ఒప్పుకుంటారు. ప్రమోషన్స్ లో దూకుడుగానే ఉన్నా.. సాయితేజ్ మూవీకి పెద్దగా క్రేజ్ రావడం లేదంటున్నారు. అందుకు కారణాలేవైనా.. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే దొంగ దూసుకుపోతుండటం ప్రతి రోజు పండగే సినిమాకు మైనస్ అనే చెప్పాలి. రిజల్ట్ లోనూ ఇదే రిపీట్ అయితే బాక్సాఫీస్ దొంగకే జై కొడుతుందేమో.. డిసెంబర్ 20.. ఈ రోజున మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రూలర్ ఒకటి. అయితే ఈ మూవీ జానర్ పూర్తిగా వేరు. అలాగే బాలయ్య సీనియర్ కాబట్టి.. ఆయనకు పోటీ ఇవ్వడం అనే మాట చెప్పలేం.. అలాగే ఆయన కూడా ఈ రెండు సినిమాలకు గట్టి పోటీ ఇస్తాడు అనుకోలేం.. అందుకే ఇక కాంపిటీషన్ అంతా మిగిలిన రెండు సినిమాల మధ్యే ఉంది.

Next Story

RELATED STORIES