ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
X

student-suicide

చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఫాతిమా అనే డిగ్రీ విద్యార్ధిని.. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీం అనే యువకుడి వేధింపులే తమ కూతురు మరణానికి కారణమంటున్నారు తల్లిదండ్రులు. ఇబ్రహీం.. ప్రేమ పేరుతో ఫాతిమాను లొంగదీసుకున్నాడని, అయితే అప్పటికే అతనికి పెళ్లై ఇద్దరు పిల్లులున్నారంటున్నారు తల్లిదండ్రులు.

చనిపోయే ముందు... ఇబ్రహీం ఫోటోలను తల్లిదండ్రులకు పంపి ఫాతిమా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం... ఫాతిమాతో పాటు మరో ఇద్దరు యువతులను సైతం మోసం చేశాడంటున్నారు ఫాతిమా తల్లిదండ్రులు. ప్రస్తుతం ఇబ్రహీం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES