ఆర్డీఓ కార్యాలయం ఎదుట ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెంటకుర్దు గ్రామానికి చెందిన రైతులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పొలాల్లోకి వెళ్లకుండా కొందరు వ్యక్తులు దారిని దున్నేసి గేటు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆర్డీవోను కలిసిన ఆ ముగ్గురు రైతులు సమస్యను వివరించి.. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES