అంతర్జాతీయం

వాషింగ్ మెషీన్‌లో పిల్లోడిని చూసి నాన్న..

వాషింగ్ మెషీన్‌లో పిల్లోడిని చూసి నాన్న..
X

washing-machine

స్నానం చేసి వచ్చి విడిచిన బట్టలు వాషింగ్ మెషీన్‌లో వేద్దామని వెళ్లాడు. అప్పటికే అందులో ఉన్న పిల్లాడిని చూసి నాన్నకి గుండె పగిలింది. ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఇంతలో వాళ్లావిడ వచ్చింది ఏమైంది అని అడిగింది. మన బాబు వాషింగ్ మెషిన్‌లో.. అని అనేసరికి వాడు శుభ్రంగా ఉయ్యాల్లో పడుకుని నిద్ర పోతున్నాడు. అది వాడి టీ షర్ట్. అయినా ఆ మాత్రం ఆలోచించలేకపోయావా.. అని సీరియస్ అయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటోతో సహా పోస్ట్ చేస్తూ రష్యాకు చెందిన ఆ పెద్ద మనిషి కొన్ని విషయాలు మనల్ని ఎంత భయపడతాయో.. ఒక్కక్షణం ఊపిరి ఆగినంత పనైంది అని రాసుకొచ్చాడు. ఆ ఫోటో చూస్తే నిజంగా చిన్నారి వాషింగ్ మెషీన్‌లో పడిపోయినట్లే ఉంది.

Next Story

RELATED STORIES