సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా

సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా

saMATA

సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకుంటారు. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ముగ్గురు నిందితులు A1-షేక్‌బాబు, A-2షేక్‌ షాబుద్దీన్, A3-షేక్ ముగ్దుమ్‌లను ప్రత్యేక వాహనంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులో కొమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి 140 పేజీల రిపోర్టు సమర్పించారు. 44 మంది సాక్ష్యులతో ఛార్జిషీట్ దాఖలైంది.

నవంబర్ 27వ తేదీన ఆసీఫాబాద్ జిల్లాలోని లింగాపూర్‌ మండలంలో సమతపై నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు సత్వర విచారణకు ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ కోర్టును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా మార్చారు. నిందితులపై 302, 376-డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించారు.

Tags

Read MoreRead Less
Next Story