తాజా వార్తలు

ఏడు పదుల వయసులో ఏం కోరిక.. రజనీ అభిమానులు షాక్

ఏడు పదుల వయసులో ఏం కోరిక.. రజనీ అభిమానులు షాక్
X

Rajanikanth

మీ వయసేంటి మీ కోరికేంటి అని ఎవరైనా తలైవాని అనగలరా.. ఏ పాత్రలో అయినా పరాయప్రవేశం చేయగల నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. 70ఏళ్ల వయసులో కూడా కుర్రకారుని ఊర్రూతలూగించే స్టెప్స్ వేస్తూ.. కుర్ర హీరోయిన్లతో డ్యూయట్లు పాడుతూ అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటారు. ఆయన స్టైలే వేరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే. తాజాగా రజనీ నటించిన దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన రజనీని కొత్త పాత్రలో నటించాలని అనుకుంటున్నారా అని అడిగితే.. ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 160 చిత్రాల్లో నటించాను. దాదాపు అన్ని పాత్రల్లో నటించా. కానీ ఒక్క ట్రాన్స్‌జెండర్ పాత్రలోనే నటించలేదు. ఏ దర్శకుడైనా అవకాశం ఇస్తే ఆ పాత్ర చేయాలని ఉంది అని రజనీ తన మనసులో మాటను బయటపెట్టారు. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇప్పటికే ఈ పాత్రలో లారెన్స్, శరత్ కుమార్, విజయ్ సేతుపతి నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి రజనీని ఈ పాత్ర వరిస్తే ఆయన నట విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు అభిమానులు.

Next Story

RELATED STORIES