ఎవరేమన్నారే తల్లీ.. ఎందుకలా ఉన్నావ్..

ఎవరేమన్నారే తల్లీ.. ఎందుకలా ఉన్నావ్..

baby

ఆరేళ్ల పిల్లాడిని అన్నం తినకుండా ఆ ఆటలేంట్రా అని అమ్మ అరిచిందని అలిగి మూతి ముడుచుకుని మూల కూర్చుంటాడు. మరి ఈ చిన్నారికి పట్టుమని పది నెలలైనా లేవు.. పుట్టి మూడు వారాలే అయిందట. మూతి ముడుచుకుని, కోపంగా చూస్తూ ఎలా ఫోజులు ఇస్తుందో చూడండి అంటూ ఫోటోగ్రాఫర్ తను తీసిన ఫోటోలు షేర్ చేశాడు. చిన్నారులు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. కల్లా కపటం తెలియని వారి అమాయకపు చూపులు కట్టిపడేస్తుంటాయి. వారి అల్లరి కూడా ముద్దుగానే ఉంటుంది. వాళ్లు చేసే అల్లరిని భరించలేని పెద్దవాళ్లు కూడా ముద్దు మాటల్ని, వారి అమాయకపు ఫేసుని చూసి ఇట్టే కరిగిపోతారు.

అమెరికా ఓహియో రాష్ట్రానికి చెందిన లూనా మూసా మూడు వారాల క్రితమే పుట్టింది. అమ్మా నాన్న తమ చిన్నారిని ఫోటో షూట్ చేయమంటూ ఓ ఫోటోగ్రాఫర్‌కి కబురంపారు. ఆయన వచ్చి పాపాయిని నవ్వించడానికి నానా తంటాలు పడ్డారు. నాకిప్పుడు నవ్వాలని లేదు.. నేనెందుకు నవ్వాలి అన్నట్లు ఫోజు పెట్టింది. సర్లే ఇది కూడా బానే వుంది అని కెమెరా క్లిక్‌మనిపించాడు ఫోటోగ్రాఫర్. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సో క్యూట్.. ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

Read MoreRead Less
Next Story