దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘చీప్ చీటర్’

దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘చీప్ చీటర్’

prasant

టాలెంట్ ఉంటే తలపై పెట్టుకునే పరిశ్రమ ఇది. అలాంటి పరిశ్రమలో ఎదుగుతున్న దశలోనే చీటర్ గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అతని టాలెంట్ కు నాని ఇంప్రెస్ అయి అతని మొదటి సినిమాను తనే నిర్మించాడు. అలా తొలి సినిమా ‘అఁ’తో ప్రతిభావంతుడు అనిపించుకున్నాడు. సామాన్య జనాలకు అర్థం కాకపోయినా.. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత అతను చేసిన ప్రయత్నాలు కూడా ఏ రకంగానూ సక్సెస్ కాలేదు. బట్ ఊహించని విధంగా అతను ఓ చీప్ చీటింగ్ తో బ్యానర్ ఐటమ్ గా మారాడు.

‘అఁ’సినిమాకు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో జాతీయ అవార్డ్ వచ్చింది. దీంతో అంతా అతన్ని తెగపొగిడారు. కానీ ఇక్కడే మనోడు చీటింగ్ లో కాలు వేశాడు. యస్.. ఈసినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించింది ‘సృష్టి విఎఫ్ఎక్స్’అనే సంస్థ. కానీ అతను మాత్రం ఆ సంస్థకు సమాచారం ఇవ్వకుండా నిర్మాత నానికి కూడా చెప్పకుండా తన స్నేహితులకు సంబంధించిన కంపెనీ పేరును జాతీయ అవార్డుల కోసం పంపించాడట. ఇలా చేయడం మోసం.. ‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఇలాంటి పొరబాట్లు చేయొద్దు’ అని నాని స్వయంగా హితవు చెప్పినా అస్సలు పట్టించుకోలేదట ప్రశాంత్ వర్మ. దీంతో నాని కూడా అతన్ని వదిలేశాడు. అలాగే ఈ విషయంపై ఒరిజినల్ గా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన సంస్థ చాలా సీరియస్ గా ఉంది. ప్రశాంత్ వర్మ చేసిన చీటింగ్ పై ప్రాపర్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

నిజానికి నేషనల్ అవార్డ్స్ లో ఇలాంటి మోసం జరగకూడదు. అతను చేసిన మోసం వారికి తెలిస్తే ఖచ్చితంగా అతనిపై చీటింగ్ తో పాటు క్రిమినల్ కేస్ లు కూడా నమోదవుతాయి. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా అతను ఎందుకు అలా చేశాడనేది తెలియదు కానీ.. మొత్తంగా ప్రశాంత్ వర్మ చేసిన చీటింగ్ చాలా చీప్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు అందరూ. మరో విషయం ఏంటంటే.. ఈ అవార్డ్ ప్రదాన కార్యక్రమం డిసెంబర్ 23న జరగబోతోంది. ఆ రోజు ఇతని ఫ్రెండ్స్ కి సంబంధించిన వారు అవార్డు తీసుకుంటే వాళ్లు కూడా చిక్కుల్లో పడతారు. మరి ఈ లోగా ప్రశాంత్ వర్మ చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటాడా.. లేక ఇండస్ట్రీలో చీప్ చీటర్ గా మిగిలిపోతాడా అనేది అతని విజ్ఞత(ఉంటే)కే వదిలేయాలి.

Tags

Read MoreRead Less
Next Story