దిశ కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

దిశ కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు
X

disha

దిశ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్‌కౌంటర్‌కి ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు నిందితులు మరో 9 హత్యలకు సంబంధించిన వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కర్నాటక వరకూ కొన్నాళ్లుగా హైవే పక్కన 15 హత్యలు జరిగాయి. వాటిల్లో చాలా వరకూ ఒకేలా ఉన్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డిలో జరిగిన హత్యల్లో ముందుగా మహిళలపై అత్యాచారం జరిగింది. తర్వా వాళ్లను హత్య చేసి డెడ్‌బాడీలు కాల్చేశారు. చాలా కేసుల్లో మృతుల వివరాలు గుర్తుపట్టేందుకు వీలుకాక కేసు దర్యాప్తు మధ్యలోనే ఆగిపోయింది. ఐతే.. దిశ కేసు నిందితుల విచారణలో బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా వాటిల్లో కొన్ని కేసుల్ని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దిశ కేసులో A1 నిందితుడు మహ్మద్ ఆరిఫ్ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు డీఎన్‌ఏ ద్వారా పాత కేసుల్ని ఛేదించే ప్రయత్నం జరుగుతోంది.

Next Story

RELATED STORIES