ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మైనర్లపై..

ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మైనర్లపై..
X

rape

దిశా దుర్ఘటపై ఆగ్రహం ఇంకా చల్లారనే లేదు. సమత ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిశా చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇలా ఎన్ని చర్యలు చేపట్టిన కామాంధుల ఆగడాలు మాత్రం తగ్గటం లేదు. మంగళవారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో రెండు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఓ మైనర్ పై అత్యాచారానికి తెగబడ్డాడు బాబు అనే యువకుడు. లక్ష్మీదేవి పల్లి మండలం గడ్డి గుట్టలో ఈ దారుణం చోటు చేసుకుంది.

చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న బాధితురాలిని కూడా అడ్డగించారు. పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి రూ.4000 జరిమానా విధించారు. విషయంలో తెల్సుకున్న లక్ష్మీదేవి పల్లి పోలీసులు నిందితుడు బాబుతో పాటు ఆరుగురు పెద్దమనుషులపై కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని ఇప్పటికే అరెస్ట్ చేయగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లా నౌపాడలో చెల్లెలు వరుసయ్యే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు..నౌపాడకు చెందిన సంతోష్.. అదే గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు అశ్లీల దృశ్యాలు కూడా చిత్రీకరించాడు.. ఆ వీడియోలు విదేశాల్లో ఉంటున్న బాలిక తండ్రికి పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు.. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితుడు సంతోష్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ పేరుతో వేధించి మైనర్ మెడలో బలవంతంగా తాళి కట్టాడు మరో యువకుడు. ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కె.కన్నాపురంలో చోటు చేసుకుంది. అనంతకుమార్‌ అనే దుండగుడు ప్రేమ పేరుతో ఓ 15 ఏళ్ల బాలికను వేధించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను ఇంటి దగ్గరే ఉంచారు. అయితే.. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలిక మెడలో అనంతకుమార్‌ బలవంతంగా తాళికట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనంతకుమార్ పోలీసులు నిందితుడు అనంతకుమార్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Next Story

RELATED STORIES