తాజా వార్తలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్‌ మిట్టల్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు

ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్‌ మిట్టల్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు
X

mittal

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్‌ మిట్టల్‌ నివాసం, వ్యాపార సంస్థలపై ఐటీ శాఖ మెరుపు దాడులు చేసింది. మంగళవారం నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం సోదాలను కొనసాగిస్తోంది. మిట్టల్‌కు చెందిన సాయిబాబా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ ఫ్యాక్టరీతోపాటు ఇంట్లో సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిట్టల్‌కు చెందిన నాలుగు పత్తి ఆధారిత పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ఢిల్లీ, పంజాబ్‌లో పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు.

Next Story

RELATED STORIES