తాజా వార్తలు

షుగరుందని షుగర్ లెస్ స్వీట్లు తింటున్నారా.. జాగ్రత్తండోయ్..

షుగరుందని షుగర్ లెస్ స్వీట్లు తింటున్నారా.. జాగ్రత్తండోయ్..
X

sugar-less

ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరికింది కదా అని సంతోషిస్తుంటే మళ్లీ ఈ వార్త ఏంటి.. చప్పటి తాగలేక చచ్చిపోతుంటే ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వచ్చి ఆదుకున్నాయనుకుంటే మరి ఇప్పుడు అవి కూడా మంచిది కాదంటున్నారు ఏం చేయాలి. దీని ద్వారా టైప్-2 మధుమేహ ముప్పు అధికమవుతోందని పరిశోధకులు తేల్చారు. 5,158 మంది మీద దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏడేళ్లపాటు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని నిర్థారించారు. కృత్రిమ తీపి కారకాలు ఉపయోగిస్తున్నవారికి హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధులు, పక్షవాతం ముప్పు తీవ్రతతో పాటు, బరువు పెరుగుదల అధికంగా ఉంటుందని వెల్లడించారు. ఇన్ని ప్రతికూల ప్రభావాలు ఎందుకు ఎదురవుతున్నాయనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదన్నారు.

Next Story

RELATED STORIES