లోకాయుక్త ఏర్పాటుకు రంగం సిద్ధం

లోకాయుక్త ఏర్పాటుకు రంగం సిద్ధం

kcr

తెలంగాణ లోకాయుక్త ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గురువారం లోకాయుక్త, హెచ్చార్సీ నియామక కమిటీలు భేటీ కానున్నాయి. తెలంగాణా లోకాయుక్త 1983 చట్టాన్ని సవరిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది. లోకాయుక్తలో ఉద్యోగుల విభజన ప్రక్రియను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల నియామకం కోసం గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం కానున్నాయి. లోకాయుక్త నియామక కమిటీలో ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్ ఉంటారు. లోకాయుక్తగా హైకోర్టు మాజీ జస్టిస్‌, ఉపలోకాయుక్తగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఉంటారు. మానవ హక్కుల సంఘం నియామక కమిటీలో ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్ ఉంటారు. అదనంగా ఈ కమిటీలో హోం మంత్రి కూడా ఉంటారు.

హెచ్చార్సీలో ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. ఒకరు హైకోర్టు రిటైర్ట్ జడ్జి కాగా, మరొకరు గతంలో మానవహక్కుల కోసం పనిచేసి వ్యక్తి ఉంటారు. వీరిద్దరిలో ఒకరికి సంఘం ఇన్‌చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సమావేశం జరిగిన వెంటనే 2 సంస్థల్లో నియామకాల ఉత్వర్వులు జారీ అవుతాయి.

Tags

Read MoreRead Less
Next Story