బాలికపై సామూహిక అత్యాచారం చేసిన అన్నదమ్ములు

బాలికపై సామూహిక అత్యాచారం చేసిన అన్నదమ్ములు
X

rape

కుమురభీం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు యువకులు. బాలిక గర్భవతి కావడంతో.. ఓ ఆర్‌ఎంపీ వద్ద గర్బస్త్రావం చేయించారు. జైనూరు మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయంలో బాలిక కుటుంబసభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభు, శ్రీకాంత్‌ వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరు అదే గ్రామానికి చెందిన బాలికపై కన్నేశారు. ముందుగా ఆత్రం ప్రభు బాలికను వంచించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇది చూసిన శ్రీకాంత్‌ తనకు సహకరించకపోతే విషయం అందరికీ చెప్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. అతను కూడా లొంగదీసుకున్నాడు. తీరా బాలిక గర్భం దాల్చడంతో... ఇద్దరు యువకులు వారి తల్లిదండ్రుల సహాయంలో అబార్షన్ కూడా ‌ చేయించారు. ఇందుకోసం తెలిసిన ఆర్‌ఎంపీని ఆశ్రయించారు. నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ మండలానికి చెందిన ఆర్ఎంపీ రమేష్ ద్వారా ఈ పని చేశారు. ఇది తెలిసి బాలిక నానామ్మతో పాటు కుటుంబసభ్యులు నిలదీయడంతో.. అసలు విషయం బయటపడింది.

బాధిత బాలికకు జరిగిన వంచనపై జైనూరూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నాన్నమ్మ. తల్లిదండ్రులు లేని పిల్లకు.. మాయమాటలు చెప్పి మోసం చేసిన ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని కోరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభు, శ్రీకాంత్‌లను అదుపులో తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గర్భస్త్రావం చేయించేందుకు సహకరించినవారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.

Next Story

RELATED STORIES