తాజా వార్తలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హెసీయూ విద్యార్థుల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌ ఎదుట.. నిరసన తెలిపారు. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ధర్నాకు వెళుతుండగా.. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో సుమారు 50 మంది విద్యార్థులు అక్కడే ధర్నాకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. న్యాయంగా ధర్నా చేస్తుంటే.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

Next Story

RELATED STORIES