తాజా వార్తలు

కాలకేయుడిని ఇలా కూడా వాడుతారా?

కాలకేయుడిని ఇలా కూడా వాడుతారా?
X

kalakeya

ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వరంగల్ జిల్లా ములుగులో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి కాలకేయ ప్లాస్టిక్ భూతం విగ్రహాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.

కాలకేయ మాదిరిగా ప్లాస్టిక్‌ అనే మానవాళి మనుగడకు, పర్యావరణానికి విలన్‌గా మారిందన్నారు కలెక్టర్‌. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి.. బాహుబలి మాదిరిగా పర్యావరణనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిర్వహించే అతిపెద్ద జన జాతర, వన జాతర, మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు.. ప్లాస్టిక్ వస్తువుల్ని తీసుకొస్తే కాలకేయ విగ్రహం వద్ద వదిలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్‌కు బదులుగా బట్ట, జూట్‌, కాగితం సంచులు, పేపర్ ప్లేట్స్‌-కప్స్‌ వాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ITDA- PO చక్రధర్‌ రావు, జిల్లా రెవెన్యూ అధికారి కే. రమాదేవి, జెడ్పీ CEO పారిజాతం, DPO వెంకయ్య, SC కార్పొరేషన్‌ ED తుల రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES