తాజా వార్తలు

మంచిర్యాల జిల్లాలో పులి సంచారం వార్త కలకలం

మంచిర్యాల జిల్లాలో పులి సంచారం వార్త కలకలం
X

tiger

మంచిర్యాల జిల్లాలో పులి సంచరిస్తందన్న వార్త తీవ్ర కలకలం రేపింది. లక్సెట్టి పేట మండలం లక్ష్మీ పూర్ గ్రామంలోని పంటపొలాల్లో పెద్ద ఆకారంలో పాదముద్రలుకనిపించడంతో రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. లక్సెట్టి పేట రేంజ్ అధికారి,పోలీసులు గ్రామానికి చేరుకొని ఆ పాదముద్రలు పులివేనని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటపొలాల్లో విద్యుత్ వైర్లు వేయవద్దని, అలా చేస్తే రైతులపై కేసులుపెడుతామన్నారు. పులి సంచారంతో ఈ ప్రాంతంలో తగుచర్యలుచేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే తమ గ్రామంలో పులి సంచరిస్తుందని తెలియడంతో ఊరి జనం ఆందోళన చెందుతున్నారు.

Next Story

RELATED STORIES